ఇటీవల ఎన్నికల్లో ఆశావర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఆశా వర్కర్ల సంఘం సభ్యులు ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డికి సోమవారం నర్సాపూర్ పట్టణ క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.