దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న స్పామ్, సైబర్ మోసపూరిత కాల్స్ సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ల విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1వ తేదీ నుంచి దేశంలోని అన్ని టెలికాం సంస్థలు ‘కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్’ సేవలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. ఇకపై అపరిచిత నంబర్ల నుంచి కాల్స్ వచ్చినప్పుడు, కాలర్ పేరు ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీనివల్ల నకిలీ కాల్స్‌ను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది. భద్రత కోసం గోప్యతా ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.