మండలానికి 2 అంబులెన్సులు సిద్ధంగా ఉండాలి: మంత్రి

తెలంగాణలో ప్రతీ మండలానికి 2 అంబులెన్సులు సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని అధికారులను మంత్రి దామోదర రాజనరసింహా ఆదేశించారు. రోగులకు 90 శాతం చికిత్స మండల కేంద్రాల్లోనే జరగాలన్నారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది అందుబాటులో లేరు అనే విమర్శ రావొద్దని చెప్పారు.ఇప్పటికే 7వేలకు పైగా నర్సు పోస్టులను భర్తీ చేశామన్నారు. మంచిర్యాలలో రూ.360 కోట్లతో చేపట్టనున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి మంత్రులు దామోదర, శ్రీధర్‌ బాబు భూమి పూజ చేసి మాట్లాడారు.

தொடர்புடைய செய்தி