పోతరాజు నేపథ్యంతో మంచు మనోజ్ కొత్త చిత్రం

వైవిధ్యభరితమైన నటనతో ఆకట్టుకుంటున్న హీరో మంచు మనోజ్, తాజాగా ఒక ఆసక్తికరమైన ‘డివైన్ యాక్షన్ థ్రిల్లర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పోతరాజు నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ బిగ్ బడ్జెట్ చిత్రాన్ని ఆర్‌పీఏ క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్‌.పి. అక్షిత్ రెడ్డి, ఆర్‌. సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్ శిష్యుడు ఏ. శ్రీధర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మంచు మనోజ్ సరికొత్త అవతార్‌లో కనిపించనున్న ఈ సినిమా టైటిల్ ను  త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕