శుక్రవారం మూసాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ సూపర్‌లగ్జరీ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో లారీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు డ్రైవర్ పురుషోత్తం(58) తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో డ్రైవర్ రాముగౌడ్‌తో పాటు పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో జిల్లా ఆసుపత్రికి తరలించగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద స్థలాన్ని పోలీసులు, అధికారులు పరిశీలించారు.