బైకుని ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి (వీడియో)

TG: నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయిటిపాముల గ్రామ శివారులో అన్నారం ఎక్స్‌ రోడ్డు వద్ద NH-65పై ఓ బైకుని లారీ ఢీకొట్టింది. ద్విచక్ర వాహనాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி

✕
✕