లారీ, ఆటో ఢీ.. ముగ్గురు మృతి

TG: మంచిర్యాల జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నస్పూర్‌లో లారీ- ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. రోజువారీ పని కోసం ఆటోలో మంచిర్యాలకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

தொடர்புடைய செய்தி

✕
✕