కామారెడ్డిలో చిరుతపులి కలకలం.. భయాందోళనలో గ్రామస్థులు

TG: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం వెంకంపల్లి గ్రామంలో గురువారం నాడు చిరుతపులి కనిపించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామం శివారులో ఉన్న నీళ్ల ట్యాంకు వద్ద చిరుత సేద తీరుతుండగా స్థానికులు గమనించి, ఆ దృశ్యాలను సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. చిరుతను వెంటనే పట్టుకుని తమకు రక్షణ కల్పించాలని స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులను వేడుకుంటున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕