TG: ఇంటర్ ఫస్టియర్‌లో చేరాలనుకునే విద్యార్థుల కోసం అక్టోబర్ 26 నుండి 29 వరకు మరో అవకాశం కల్పించారు. ప్రభుత్వ, మోడల్, రెసిడెన్షియల్ కాలేజీల్లో ఎటువంటి ఫైన్ లేకుండా ప్రవేశాలు పొందవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు. అయితే, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో చేరే విద్యార్థులు మాత్రం అడ్మిషన్‌కు రూ.500 ఆలస్య రుసుము చెల్లించాలని బోర్డు స్పష్టం చేసింది. గుర్తింపు పొందిన కాలేజీల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.