ఇల్లందు నియోజకవర్గంలోని గార్ల మండల తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం సాంఘిక ఆర్థిక (కుల గణన) సర్వే నిర్వహించే ఎన్యూమరేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గార్ల మండల తహశీల్దార్ రవీందర్ పాల్గొని మాట్లాడుతూ, ఎన్యూమరేటర్లు వచ్చే నెల ఆరో తేదీ నుంచి నిర్వహించే సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా సర్వే చేయాలని సూచించారు.