ఇల్లెందు పట్టణంలోని 24వ ఏరియాకు చెందిన ఆంథోని విమల్(30) గుండెపోటుతో బెంగళూరులో మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. విమల్ గతంలో ఓ మీసేవా కేంద్రంలో పని చేశాడు. రెండు సంవత్సరాల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగ రీత్యా బెంగళూరు వెళ్లి వివేకానందనగర్లో ఉంటున్నాడు. క్రికెట్ ఆడటానికి వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు.