అశ్వాపురం మండలంలోని వేములూరు వలస గొత్తికొయ గ్రామాలలో నివసించే ఆదీవాసి ప్రజలకు వేములూరు గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో రోటరీ క్లబ్, భద్రాచలం వారి సహకారంతో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ప్రారంభించారు. మొత్తం 07 గుత్తికోయ గ్రామాల నుంచి సుమారు 400 కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.