సనాతన హిందూ ధర్మ పరిరక్షణ మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెం గణేష్ ఆలయం నుండి విద్యానగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఇంద్రగంటి శంకర ప్రసాద్ శర్మ మాట్లాడుతూ హిందువులు అందరూ ఐక్యంగా ఉండాలని, మన ఆలయాల పరిరక్షణ, హిందూ ఆచారాలను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు. ఈ ర్యాలీలో వందలాది హిందువులు పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.