పాల్వంచ: డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

పాల్వంచ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (సీహెచ్సీ) వంద పడకల ఆసుపత్రిగా మారుస్తామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీహెచ్సీలో రూ. 40 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన రక్తశుద్ధి (డయాలసిస్) కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ డయాలసిస్ కేంద్రంలో రోగులకు రోజువారీగా మూడు దశల్లో చికిత్స అందిస్తారన్నారు. వైద్యులు, సిబ్బంది రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி