కొత్తగూడెం: బ్యాంకులోని పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

కొత్తగూడెం సహకార సంఘం పరిధిలోని లక్ష్మీదేవిపల్లి మండలంలో గల మైలారం, హేమచంద్రపురం, గ్రామపంచాయతీలలో కొత్తగూడెం సొసైటీ ఛైర్మన్ వీర హనుమంతరావు అధ్యక్షతన నాబార్డ్ వారి సహకారంతో బుధవారం రైతులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. ప్రతీ రైతు సహకార బ్యాంకులలో ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, అన్ని రకాల రుణాలను అతి తక్కువ వడ్డీ రేట్లకు పొందవచ్చని అన్నారు. బ్యాంకు సిబ్బంది, రైతు నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி