450 కోట్లతో జంట పట్టణాలకు రింగ్ రోడ్డు: ఎమ్మెల్యే

కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రూ. 450 కోట్లతో రింగ్ రోడ్డు నిర్మాణానికి రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించినట్లు వెల్లడించారు. పురపాలకంలోని పలు వార్డుల్లో డీఎంఎఫ్ నిధులు రూ. 4. 50 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, బీటీ రహదారులు, పార్కుల నిర్మాణ పనులకు ఆయన శనివారం శంకుస్థాపనలు చేశారు.

தொடர்புடைய செய்தி