భద్రాచలం ఐటీడీఏలో సోమవారం ఉదయం 10. 30 గంటలకు గిరిజన దర్బారు ఉంటుందని సంబంధిత అధికారులు సకాలంలో హాజరు కావాలని పీఓ రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు తమ సమస్యల పరిష్కారం కోసం రాత పూర్వకంగా దర్బారులో దరఖాస్తు చేసుకో వాలని వెల్లడించారు.