వాంకిడి: బాలికల పట్ల లింగ వివక్షతను విడనాడాలి

బాలికల పట్ల జరుగుతున్న హింస, వేధింపుల నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా బాలల సంరక్షణ విభాగం సోషల్ వర్కర్ డోoగ్రి ప్రవీణ్ కుమార్ కోరారు. శుక్రవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని వాంకిడి మండలములోని ఇంధాని గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ లింగ వివక్ష, హింస లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు.

தொடர்புடைய செய்தி