హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్ లోని తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ముగ్గురు మైనర్ బాలురు కాచిగూడ నుండి చందానగర్ లోకల్ MMTS రైలులో ప్రమాదకరమైన స్టంట్స్ చేశారు. పిల్లలు రన్నింగ్ ట్రైన్ ఎక్కుతూ.. దిగుతూ స్టంట్స్ చేశారు. ఓ పిల్లాడు రైలు ఎక్కి.. ఒక కాలు బయటకి పెట్టి ప్రమాదకరంగా స్టంట్స్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో.. ప్రమాదవశాత్తు రైలు కింద పడితే ఎవరు బాధ్యులని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.