సత్తుపల్లి: దెబ్బతిన్న ఇండ్లకు మరమ్మతులు చేపట్టండి

సత్తుపల్లి మండలం జగన్నాథపురంలోని మండల ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రం భవనాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం ఎమ్మెల్యే మట్ట రాగమయితో కలిసి ప్రారంభించారు. అనంతరం వెంగళరావునగర్ రోడ్ నెం. 6లో ఉపరితల బొగ్గు గనుల్లో సింగరేణి మైనింగ్ బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు. వెంగళరావు నగర్ కాలనీలో దెబ్బతిన్న ఇళ్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని సింగరేణి సీఎండీ బలరాంను ఆదేశించారు

தொடர்புடைய செய்தி