రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంపూర్ణ సహకారంతో సింగరేణికి ఉజ్వల భవిష్యత్ ఉందని సీఎండీ బలరాం వెల్లడించారు. సత్తుపల్లి మండలం జేవీఆర్ ఓసీ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి 'ఉజ్వల సింగరేణి ఉద్యోగుల పాత్ర'పై సదస్సు నిర్వహించారు. చాలా దేశాల్లో బొగ్గు వెలికితీయడాన్ని నిలిపివేస్తున్నారని, ఇక్కడ బొగ్గు నిల్వలు అడుగంటే అవకాశమున్నందున సంస్థ బొగ్గుతో పాటు ఇతర మార్గాల్లో విస్తరణపై దృష్టి సారించిందన్నారు.