కల్లూరు మండలం పలు గ్రామాల్లోని కోళ్ల ఫారాల్లో కోళ్లకు వైరస్ సోకి సుమారు 50 వేల కోళ్లు మృతిచెందాయి. సుమారు రూ. 35 లక్షల వరకు నష్టం జరిగిందని భావిస్తున్నారు. మండలంలోని పాయపూరు, యజ్ఞనారాయణపురం, పెద్దకోరుకొండి, వెన్నవెళ్లి, పేరువంచ, నారాయణపురం, కొర్లగూడెం, కల్లూరులోని కోళ్ల ఫారాల్లో కోళ్లు పెంచుతున్నారు. గాలి నుంచి సోకిన వైరస్ వల్ల బ్రాయిలర్ తో పాటు నాటు కోళ్లు కూడా మృత్యువాత పడుతున్నట్లు చెబుతున్నారు.