ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ఉపాధి హామీ పథకం అమలులో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అడిషనల్ డిఆర్డిఓ శిరీష తెలిపారు. శుక్రవారం కూసుమంచిలో జరిగిన సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంలో 2023- 24 సంవత్సరంలో జరిగిన ఆరు కోట్ల విలువైన పనులపై సామాజిక తనిఖీల్లో వెల్లడైన అంశాలను సీఆర్పీలు ఈసందర్భంగా వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వేణుగోపాల రెడ్డి, ఏపిడి శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி