జూనియర్ మరియు ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు వెంటనే క్రమబద్ధకరించాలి

మధిర నియోజకవర్గం మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బోనకల్లు మండల అధ్యక్షుడు ఇరుగు జానేసు, బోనకల్ మండల అధికార ప్రతినిధి మర్రి ప్రేమ్ కుమార్, మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉదయం 5 గంటలకే ఆ గ్రామానికి చేరుకొని ఆ గ్రామ పాశుద్ధ్య పనులు చేస్తూ, ఇంటి బిల్లు వసూలు చేస్తూ, నీటి బిల్లు వసూలు చేస్తూ, మురికి నీరు ఆగిన చోట పారిశుధ్య కార్మికులతోని ఎన్నో పనులు చేసుకుంటూ పోతున్నారు. గతంలో కరోనా టైములో వాళ్ళ ప్రాణాలు లెక్కచేయకుండా కరోనా వచ్చిన ప్రతి వ్యక్తి వద్దకు వెళ్లి బీజింగ్ పౌడర్ చెల్లించి వారికి తగు జాగ్రత్తలు చెప్పేవారు. వారితోపాటు ఆశ వర్కర్లు ఐకెపి వారు డోర్ టు డోర్ వెళ్లి పనిచేసేవారు. ఇలాంటి వారికి ఉద్యోగ భద్రత లేదు. వారికి జీతం తక్కువ ఎక్కువ పని. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతాలు పెంచడం కాదు ఇలాంటి చిన్న ఉద్యోగులను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించి వారికి 26 వేల రూపాయలు జీతాలుగా ఇచ్చేటట్లు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేటట్లు వారికి ఆరోగ్య భీమా ప్రభుత్వ ఉద్యోగులుగా వారు గుర్తించాలని, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పంచాయతీ సెక్రెటరీలకు ఐకెపి లకు ఉద్యోగులక జీతాలు పెంచాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி