చింతకాని మండలం నామవరం గ్రామంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు శనివారం డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అధికారులు పారదర్శకంగా ఎలాంటి తప్పులు జరగకుండా సర్వే నిర్వహించాలని సూచించారు. ప్రజలు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గోని అధికారులకు సహాకరించాలని కోరారు.