బోనకల్ మండలం భాగం సేవా ఫౌండేషన్ నిర్వాహకులు భాగం రాకేష్ మరోసారి ఉదారతను చాటుకున్నారు. గుండె ఆపరేషన్ చేయించుకున్న చిన్నారికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ, 10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామానికి చెందిన చిన్నారి పొదిలం రోహిత్ కి గుండెలో రంధ్ర ఉండటంతో ఇటీవల శాస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ సేవా కార్యక్రమంలో అల్లిక కాశయ్య, ప్రభాకర్ మర్రి హరీష్, గోపి, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.