చింతకాని: అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య

రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్నమండవ గ్రామంలో తుపాకుల అగ్గిరాముడు (42) అనే రైతు అప్పులబాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ నాగుల్మీరా తెలిపారు. ఒక ఎకరం సొంత భూమితో పాటు 3 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న అగ్గి రాముడు, అప్పుల భారంతో గత అర్ధరాత్రి ఉరేవేసుకున్నాడని తెలిపారు. శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

தொடர்புடைய செய்தி