భద్రాచలం పట్టణంలోని సీతారామనగర్ కాలనీలో నివసించే మోర్తాల కళావతి (55) బుధవారం అనారోగ్యంతో మరణించింది. మరొకరికి చూపు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కళావతి రెండు నేత్రాలను హైదరాబాదు చెందిన అగర్వాల్ ఐ బ్యాంక్ సంస్థ ప్రతినిధి జానీకి ఆమె భర్త సీతారామరెడ్డి అందజేశారు. పలువురు సీతారామరెడ్డిని అభినందించారు.