సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో అప్పులు భారమై శనివారం లింగం(45) ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం పోలీసులు వివరాలు అందించారు. లింగం తాడ్వాయి తహసీల్దార్ ఆఫీసులో అటెండర్ గా పనిచేస్తున్నాడని, లింగంకు ముగ్గురు కూతుర్లు ఉండగా, ఇద్దరి కూతుర్ల పెళ్లిళ్లు చేశాడన్నారు. అప్పుల కారణంగా జీవితంపై విరక్తి చెంది గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.