మహాత్మా గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి

దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్య్రం సిద్దింప చేసిన గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎల్లారెడ్డి ఏఎంసి చైర్ పర్సన్ మారెడ్డి రజిత వెంకట్రాంరెడ్డి సూచించారు. బుధవారం ఏఎంసి కార్యాలయ ఆవరణలో గాంధీజీ 155 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి చైర్ పర్సన్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చూపిన అహింస మార్గం అందరికీ అనుసరణీయమని అన్నారు.

தொடர்புடைய செய்தி