ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు ఆహ్లాదకరంగా ఉందేందు కోసం సర్వే నంబర్ 1406లో నిర్మించిన నగర వాటికను మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ మంగళవారం పరిశీలించారు. పట్టణంలోని అటవీ ప్రాంతంలో వాటికను ఏర్పాటు చేయాలని అటవీ శాఖ నిర్ణయించింది. ప్రజలు వాకింగ్ తో పాటు ఆహ్లాదకరంగా గడిపేందుకు మంజూరు చేయడం జరిగిందని, సుమారు లక్ష వ్యయంతో నిర్మించారు. నగర వాటికను కొన్ని కలుపు మొక్కలు పెరగడంతో వీటిని తొలగించి, పరిశుభ్రంగా ఉంచాలన్నారు.