ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకర వాతావరణంలో సేద తీరేందుకు కోసం నిర్మించిన నగర వాటికకు త్వరలో కొత్త హంగులతో సిద్ధం చేస్తామని మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. మంగళవారం పట్టణ సమీప అటవీ ప్రాంతంలోని నగర వాటికను చైర్మన్ పరిశీలించారు. నగరవాటిక చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు చేయడం జరుగుతుందన్నారు.