రాష్ర్రంలో అట్టడుగు వర్గాల శ్రేయస్సును కాంక్షించి నిజమైన పేదలకు అన్ని ప్రభుత్వ పథకాలు అందించి న్యాయం చేసేందుకు 1931 తరువాత మళ్ళీ కాంగ్రెస్ సర్కార్ కులగణన చేపట్టిందని ఎమ్యెల్యే మదన్ మోహన్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి మున్సిపల్ లోని 2వ వార్డుతో పాటు పలు వార్డుల్లో జరుగుతున్న కులగణన సర్వే పరిశీలించారు. పొరపాట్లు లేకుండా సర్వే చేయాలని ఎన్యుమరేటర్లకు సూచించారు.