ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోనీ నూతన రోడ్లు నిర్మాణం, అంగన్వాడీ భవనం నిర్మాణం కొరకు, ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం, నాగిరెడ్డి పేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫర్నిచర్ కొరకు 53. 75 లక్షల ఎస్ డిఎఫ్ నిధులు మంజూరు అయినట్లు ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.