నిజామాబాద్ జిల్లా ధర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. శనివారం రాత్రి ఓ యువతిపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం.. బాధితురాలితో ఉన్న మరో యువతి ఘటనాస్థలి నుంచి పారిపోయి గ్రామస్తులకు విషయం చెప్పడంతో ఈ ఘటన వెలుగుచూసింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.