తెలంగాణ రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో వర్షం కురిసింది. అలాగే పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్లు కురుస్తాయని పేర్కొంది. గురువారం కామారెడ్డి, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.