కామారెడ్డి జిల్లా పిట్లం మండలం సిద్ధాపూర్ తండాలో అర్ధరాత్రి సుమారు 1 గంటకు చోరీ జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు.. సిద్ధాపూర్ తండా వాసి కేతావత్ గోపాల్ ఇంటి బయట నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో దుండగులు తనపై రాడ్లతో దాడి చేసి, తన భార్యకు సంబంధించిన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శనివారం బాధితుడు తెలిపారు.