బాన్సువాడ పట్టణంలోని మార్కెట్ యార్డులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ పంటలను విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.