జానీ మాస్టర్ ట్విట్టర్ వేదికగా సంచలన ప్రకటన చేశారు. 'నిర్ధారణవ్వని ఆరోపణలని కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు. అవేవీ నమ్మకండి!! నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా వెళుతున్నాను. నా కొరియోగ్రఫీలో 'గేమ్ ఛేంజర్' నుండి ఓ మంచి పాట రాబోతుంది' అని పేర్కొన్నారు.