పెగడపల్లి మండలంలోని నందగిరి గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో "పొలంబాట" కార్యక్రమాన్ని మంగళవారం జగిత్యాల డీఈ రాజిరెడ్ది నిర్వహించారు. విద్యుత్ సమస్యలకై టోల్ ఫ్రీ 1912కి తెలియజేయాలని ఆయన అన్నారు. రైతులు పొలాల వద్ద స్టారర్లు, ఫ్యూజులు, స్టారర్ బాక్సులు నాణ్యతగా ఉండేలా చూసుకోవాలన్నారు. మోటర్లకు కెపాసిటర్లు బిగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి ఏడీఈ వరుణ్, పెగడపల్లి ఏఈ వెంకట్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.