2029 నాటికి అంతరిక్ష ప్రయోగ మౌలిక సదుపాయాలను విస్తరించి, నాలుగు లాంచ్ ప్యాడ్లను సిద్ధం చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) లక్ష్యంగా పెట్టుకుందని సంస్థ చైర్మన్ వి.నారాయణన్ తెలిపారు. పెరుగుతున్న శాటిలైట్ ప్రయోగాల డిమాండ్‌ను తట్టుకోవడానికి తమిళనాడులోని కులశేఖరపట్నంలో 2,000 ఎకరాల్లో కొత్త ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గగన్‌యాన్ ప్రయోగం, జపాన్ భాగస్వామ్యంతో చంద్రయాన్-5 ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నామని, ఇస్రో జాతీయ సంస్థగానే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.