T20Iల్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక ఫోర్లు బాదిన ప్లేయర్గా ఇషాన్ కిషన్ రికార్డు క్రియేట్ చేశారు. వెస్టిండీస్తో జరిగిన ఐదో T20లో ఈ సరికొత్త రికార్డు నమోదు చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఇషాన్ 122 ఫోర్లు బాదారు. ఆ తర్వాతి స్థానాల్లో రిజ్వాన్(119-2021), బెన్నెట్(109-2025), సూర్యకుమార్ యాదవ్(106-2022), బాబర్(99-2021) ఉన్నారు. మరోవైపు అభిషేక్ శర్మ ఒకే ఏడాదిలో 70 సిక్సర్లు బాదిన తొలి ప్లేయర్గా నిలిచారు.