MI కెప్టెన్‌గా రోహిత్ శర్మ కన్ఫామ్?

ముంబై ఇండియన్స్ జట్టు తదుపరి కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నట్లు క్రీడావర్గాలు వెల్లడించాయి. ఈ నెల 16 లేదా 18న యాజమాన్యం అధికారికంగా ప్రకటన చేయనున్నాయని తెలిపాయి. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్య పంజాబ్ జట్టులోకి వెళ్లడం ఖాయం కావడంతో రోహిత్‌కు లైన్ క్లియర్ అయింది. తిలక్ వర్మ పేరును పరిశీలించినప్పటికీ, ఫ్రాంచైజీ ఒత్తిడి మేరకు రోహిత్ శర్మ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ మార్పు ముంబై జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపనుంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕