బాలిస్టిక్ క్షిపణులపై ఉన్న 2,000 కిలోమీటర్ల స్వీయ పరిమితిని ఎత్తివేస్తున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) ప్రకటించింది. ఇజ్రాయెల్, అమెరికాల దాడులకు హద్దుల్లేని ప్రతిదాడులు చేద్దామని ఇరాన్ సేనలకు సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జనరల్ హొస్సేన్ మొహెబ్బి మాట్లాడుతూ, క్షిపణి సామర్థ్యాలను ఇకపై ఆచరణలో చూపిస్తామని వెల్లడించారు.