డిసెంబర్ 16న ఐపీఎల్ 2027 మినీ వేలం!

ఐపీఎల్ 2027 సీజన్ కోసం మినీ వేలాన్ని డిసెంబర్ 16న గోవాలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు క్రిక్‌ఇన్ఫో వెల్లడించింది. నవంబర్ 15ను ఆటగాళ్ల రిటెన్షన్‌కు తుది గడువుగా నిర్ణయించినట్లు సమాచారం. రిటెన్షన్ ప్రక్రియ పూర్తయ్యాక వేలంలో అందుబాటులో ఉండే ఆటగాళ్ల రిజిస్టర్డ్ పూల్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీలకు పంపుతుంది. ఇప్పటికే రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్ వంటి కీలక ఆటగాళ్ల ట్రేడింగ్ జరిగింది. మార్చి చివరి వారంలో ఐపీఎల్ సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕