TG: మహాశివరాత్రి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి కూలీలకు 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' నిధులు విడుదల చేసింది. ప్రతి మండలంలోని ఒక పైలెట్ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి మొత్తం 66,240 మందికి రూ.6వేల చొప్పున జమ చేసింది. ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లోని కూలీల ఖాతాల్లో ప్రభుత్వం రూ.6000 చొప్పున జమ చేసింది. అయితే మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయా? కామెంట్ చేయండి.