మూడో టీ20లో భారత్‌ విజయం

వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 14 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 224 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 209/7 రన్స్‌కే పరిమితమైంది. హెట్‌మయర్‌ 43, కమిల్‌ పూరన్‌ 42, రూథర్‌ఫర్డ్‌ 32, సాంప్సన్‌ 21, షమర్‌ స్ప్రింగర్‌ 35* రన్స్‌ చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 3, నమన్‌ ధీర్‌ 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్‌ పటేల్‌, నితీశ్‌రెడ్డి చెరో వికెట్‌ తీశారు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో ఉంది.

தொடர்புடைய செய்தி

✕
✕