2050 నాటికి ఊబకాయంతో భారత్‌కు ముప్పు!

ప్రపంచ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పుల్లో ఊబకాయమే అతిపెద్దదని ది లాన్సెట్ కమిషన్ వెల్లడించింది. 2025 మార్చిలో ప్రచురించిన నివేదిక ప్రకారం, 1990లో 3.6 కోట్లుగా ఉన్న ఊబకాయుల సంఖ్య 2021 నాటికి 18 కోట్లకు చేరింది. 2050 నాటికి భారత్‌లో దాదాపు మూడో వంతు మంది (సుమారు 45 కోట్లు) ఈ సమస్య బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలని, జీవనశైలి మార్పులపై దృష్టి పెట్టాలని కమిషన్ సూచించింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕