భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు తన స్కోరును 200 పరుగుల మార్కు దాటించింది. 34 ఓవర్లు ముగిసే సమయానికి పాకిస్థాన్ 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. గత మూడు ఓవర్లలో పాక్ 19 పరుగులు రాబట్టింది. విప్రాజ్ నిగమ్ వేసిన 32వ ఓవర్లో హసన్ నవాజ్ సిక్స్ కొట్టగా, షాబాబ్ అహ్మద్ వేసిన 34వ ఓవర్లో ఫర్హాన్ యూసఫ్ ఫోర్ సాధించాడు. ప్రస్తుతం క్రీజులో ఉన్న హసన్ నవాజ్ 67 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్తున్నాడు.