న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో వర్షం కారణంగా తొలత టాస్ ఆలస్యమైంది. వర్షం తగ్గాక మ్యాచ్ ప్రారంభమైనప్పటికీ మళ్లీ వర్షం పడటంతో కొంత సమయం ఆగి.. మ్యాచ్ను 10 ఓవర్లు కోత విధించారు. భారత్ టార్గెట్ 40 ఓవర్లలో 167 పరుగులు చేయాల్సి ఉంది. తిరిగి మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మళ్లీ వాన ప్రారంభమైంది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 12 ఓవర్లకు 64/1 పరుగులు చేసింది. క్రీజ్లో శుభ్మన్ గిల్ (27), విరాట్ కోహ్లీ (29) ఉన్నారు.